తప్పకుండా సీఎం అవుతా : ఎమ్మెల్సీ కవిత

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. జాగృతి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యమంలో సాంస్కృతిక అంశాలపై పోరాడింది. మరోసారి దీనిని బలోపేతం చేయడానికి కవిత కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం వేగం పెంచారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం పదవిపై  ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఇంటర్వ్యూలో మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఇంకో పదేళ్లకో, పదిహేనేళ్లకో, ఎప్పటికైనా తప్పకుండా సీఎం అవుతా. ఎవరైనా రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎదగాలనే కోరుకుంటారు’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో BRS అధికారంలోకి వస్తే నిజామాబాద్ పై దృష్టి సారిస్తానని కవిత చెప్పుకొచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram