నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
2014వ సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో రవిషా అనే వ్యక్తి, అతి వేగంగా, నిర్లక్ష్యంతో కారు నడిపి మరణించగా, ఇన్సూరెన్స్ కంపెనీ రూ.80 లక్షలు చెల్లించాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి కుటుంబ సభ్యులు రవీష్ అనే వ్యక్తి అతివేగంగా వాహనం నడుపుతూ మరణించగా.., అతడి కుటుంబం బీమా పరిహారం కోసం కోర్టులో పిటిషన్ వేసింది. కానీ, పరిహారం చెల్లించేందుకు కోర్టు నిరాకరించింది. ప్రమాదం మృతుడి నిర్లక్ష్యం వల్లే జరిగిందని తేల్చింది. బీమా పాలసీలో కవరేజ్ ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా నడిపితే పరిహారం పొందలేరని కోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణిస్తే, వారి కుటుంబ సభ్యులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరంటూ తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు
ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితుడి కుటుంబ సభ్యులు
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే దానికి ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.