గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనారోగ్యం బారినపడ్డారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం కేసీఆర్ కు పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ కు మెడికల్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ కు అనారోగ్యం అని తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
Post Views: 34