మల్లికార్జున ఖార్కె తో సీఎం రేవంత్ భేటీ.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో ముఖ్యమంత్రి రేవంత్  భేటీ అయ్యారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖర్గేతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సమాజిక సమర భేరి సభ జరుగనుంది .

పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను  ప్రజల్లోకి  క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం ఏంటి విషయాలపై చర్చిస్తారు. అందరూ పని చేయాలని ఈ సందర్భంగా ఖర్గే సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కీలక సూచనలు ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram