గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొరం వారి గుంపు గ్రామంలోని జి.పి.ఎస్. పాఠశాలలో, గూంజ్ సంస్థ సహకారంతో ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, కంపాస్, వాటర్ బాటిల్స్, ఏరేజర్లు, మొత్తం 12 మంది విద్యార్థులకు ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ పాఠశాల ఉపాధ్యాయులు ఇర్ప క్రిష్ణయ్య విద్యార్థులకు తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ సందర్భంగా మాట్లాడిన తోలెం రమేష్ పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు హాజరై మంచి చదువు చదివి, గురువులకు, తల్లిదండ్రులకు తమ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని” కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సంస్థ సభ్యులు, వాలంటీర్స్, బట్ట బిక్షపతి, కుంజా రాము, అంగన్వాడీ టీచర్ కొమరం శిరీష,విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.
