విష స‌ర్పాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌ : డాక్టర్ దుర్గాభవాని 

వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు

గోల్డెన్ న్యూస్ / పినపాక : వర్షాకాలం వచ్చిందంటే పాముకాటు బాధితులు పెరుగుతారు. ఇంటి పరిసరాల్లో అపరిశుభ్రత ఉండటంతో విషసర్పాలకు ఆవాసాలుగా మారుతాయి. వర్షాలు కురవడం వల్ల విష జ్వరాలతో పాటు విష సర్పాలు సైతం సంచరిస్తూ ఉంటాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు దుర్గాభవాని సూచించారు. మంగళవారం ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన  ఊకె విక్రం 18 నెలల బాలుడు ఇంట్లో పాము కాటుకు  గురైనట్లుగా తెలియజేశారు. గమనించిన బాలుడి తల్లిదండ్రులు పినపాక  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా ఆసుపత్రికి పంపించినట్లుగా తెలిపారు. పాముకాటు తేలుకాటు సంభవిస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అన్నారు. అనారోగ్య సమస్య  ఉన్న వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గాని, దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్తకు తెలియజేయాలని కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram