పోలీసులకు సవాల్ గా మారిన దొంగలు
గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : హైదరాబాద్ లోని జీడిమెట్లలో దొంగలు పోలీసులకే సవాల్ విసిరారు. మంగళవారం ఆ ప్రాంతంలో నేరాల నియంత్రణలో భాగంగా 50 మంది పోలీసులతో ఓ ఏసీపీ స్థాయి అధికారి తనిఖీలు చేశారు. పాత నేరస్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే రోజు రాత్రి రెండు బైకులపై వచ్చిన నలుగురు దొంగలు మార్కండేయనగర్‌లో ఉన్న HDFC ఏటీఎంలోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్లతో 15 నిమిషాల్లోనే నగదు పెట్టే ట్రేలను తీసుకొని పారిపోయారు. ఆ ఏటీఎంలో రూ.34 లక్షలు ఉన్నట్లు సమాచారం.
Post Views: 19