గోల్డెన్ న్యూస్/కరకగూడెం : మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా కరకగూడెం కుర్నవల్లి గ్రామంలో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి సిసి విజయలక్ష్మి మాట్లాడారు. వడ్డీ లేని రుణాలు, మహిళా సాధికారత, ఉచిత బస్సు పథకం, ఆరు గ్యారెంటీలపై అవగాహన కల్పించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. అన్నారు.ఈ నెల 10 నుంచి 16 వరకు మహిళా సాధికారిత అంశాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ ఓ మారుతి, గ్రామ దీపిక ముత్యాల రమాదేవి. స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 73