బీసీ రిజర్వేషన్లు జాగృతి పోరాట ఫలితమే : ఎమ్మెల్సీ కవిత

గోల్డ్ న్యూస్ / వెబ్ డెస్క్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు జాగృతి పోరాట ఫలితమే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత అన్నారు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృవియోగం చెందడంతో, వారి స్వగ్రామమైన కరకగూడెంలో గురువారం ఆయనను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరవాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ బీసీలు, తెలంగాణ జాగృతి విజయం అని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram