బీసీ రిజర్వేషన్ తర్వాతే స్థానిక ఎన్నికలు: పొంగులేటి

గోల్డ్ న్యూస్ /వెబ్ డెస్క్ :తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఇప్పటి వరకు క్యాబినెట్ ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష చేశాం. దేశానికే ఆదర్శంగా కులగణన చేశాం. బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదించాం. త్వరలోనే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని సవరిస్తాం’ అని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram