రాష్ట్రంలో 22 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం,

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 18 మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరుపై కూడా సమీక్ష జరిపింది.

త్వరలో 22,033 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రివర్గం చర్చించింది.

అంతేకాకుండా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్ వివరాలు, పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆర్థిక శాఖను కేబినెట్ ఆదేశించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram