గోల్డెన్ న్యూస్ /ఏటూరూ నాగారం :మండలంలోని కొండాయి గ్రామంలోని వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని మంత్రి సీతక్క స్వయంగా సందర్శించారు. రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆమె దగ్గరుండి పరిశీలించారు. పనుల వేగాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తో కలిసి బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని తిలకించిన మంత్రి, తక్కువ సమయంలో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అదే సందర్భంలో, వాగును దాటి ట్రాక్టర్‌పై ప్రయాణించి అవతలి వైపునకు చేరుకున్న మంత్రి సీతక్క, ఇటీవల నిర్మితమైన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. హోదాని పక్కన పెట్టి, అన్ని ఆటంకాలను అధిగమిస్తూ ములుగు అభివృద్ధిలో
ప్రత్యేకతను చాటుకుంటున్నారు మంత్రి సీతక్క.
Post Views: 20