తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి చెందిన మీడియా సంస్థ Q NEWS కార్యాలయంపై శనివారం ఉదయం దాడి జరిగింది
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకార్యాలయంపై దాడి జరిగింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాయలంపై దాడికి దిగారు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్ల తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాలు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు.
Post Views: 30