ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

 ⇒  ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్ల కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

⇒ కరకగూడెంలో ఆటోడ్రైవర్ల డిమాండ్.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : రాష్ట్ర ప్రభుత్వం మ హిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకం తీసుకరాగా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని,వారిని ప్రభుత్వం ఆదుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం ఆటో యూనియన్ అధ్యక్షులు కొమరం సాంబ డిమాండ్ చేశారు. ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని కోరారు. కరకగూడెం ఆటో అడ్డాలో ఆది వారం ఏర్పాటుచేసిన ఆటోడ్రైవర్ల సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని అమలు చేయ డంలో విఫలమవుతోందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది. కిరాయిలు లేక ఇప్పటివరకు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం ఆర్థిక సాయమూ అందకపోవడంతో ఆర్థికంగా చితికి పోతున్నామన్నారు. కాలయాపన చేయకుండా వెంటనే ఆర్థిక సాయాన్ని అందించి డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు నిట్టా సౌందర్యరావు, గుడ్ల రంజిత్, సాదన పల్లి లక్ష్మీనారాయణ, షేక్ అఫ్రోజ్, సాయిచరణ్, కాట సాంబశివరావు, మధు, స్వామి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram