భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్..
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : జాతీయ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వరుణ్ చౌదరి జీ ఆదేశాల మేరకు, ఒడిశాలోని బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో జరిగిన దారుణ సంఘటనపై “బేటీ బచావో”లో విఫలమైన బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపరు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ ABVP విద్యార్థిని సౌమ్య శ్రీ, HOD సమీర్ సాహు నుండి లైంగిక వేధింపులు మరియు మానసిక హింసను ఎదుర్కొని తనను తాను నిప్పంటించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, ఆమె 90% కాలిన గాయాలతో AIMS భువనేశ్వర్‌లో చికిత్స పొందుతోంది. సౌమ్య శ్రీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక విద్యార్థి గురించి కాదు, ఇది భద్రత, గౌరవం మరియు వినే వ్యవస్థకు అర్హులైన ప్రతి మహిళ కోసం పోరాటం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ టౌన్ ఉపాధ్యక్షులు ఉస్మాన్,NSUI నాయకులు నయీమ్,కాటి సంతోష్, షేక్ షాను, నిఖిల్, సమీర్, షాహిద్, జమీర్, ఇంకెవరు, పవన్, తదితరులు పాల్గొన్నారు..