ఉచిత రక్త పరీక్ష శిబిరం సద్వినియోగం చేసుకోండి.

ఉచిత రక్ష పరీక్ష శిబిరంలో మీ బ్లడ్ గ్రూప్ తెలుసుకోండి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి.

గోల్డెన్ న్యూస్ /  కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్, ఎస్పీ  రోహిత్ రాజు నేతృత్వంలో రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో కొత్తగూడెం నగరంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో మంగళవారం ఉదయం రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ (ROSE) కార్యక్రమం  నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో ఉచిత రక్షిత పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ  ఉచిత  పరిక్ష చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..ఉచిత రక్త పరీక్ష శిబిరంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రజలు తమ యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. తద్వారా ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన లేదా ఏదైనా అత్యవసర సందర్భాలలో రక్తదానం చేసేందుకు సులభంగా ఉంటుందని, అత్యవసర సమయంలో ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 60 శాతం మందికి పైగానే తమ బ్లడ్ గ్రూప్ తెలియని పరిస్థితులు ఉన్నాయని, ఈ ఉచిత రక్త పరీక్ష శిబిరం ద్వారా తమ బ్లడ్ గ్రూప్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు, ఇలా చేయించుకోవడం ద్వారా ఎదుటి వ్యక్తికి సహాయం చేయడమే కాకుండా తన యొక్క బ్లడ్ గ్రూప్ పై అవగాహన ఉండడం స్వీయ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు..  

Facebook
WhatsApp
Twitter
Telegram