మావోయిస్టు లొంగిపోవాలని విజ్ఞప్తి.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు: మండలంలో ఉన్నటువంటి గుత్తి కోయ గ్రామాల్లో ప్రధాన కూడలి మరియు రహదారిలో ఇరవండి కొసాగుంపు, మోత పంచాయతీ చింతకుంట,
కృష్ణ సాగర్, పంచాయతీ లో గుత్తి కోయ గ్రామం, టేకుల చెరువు పంచాయితీ గోపాలపట్నం,ఉప్పు శాఖ పంచాయతీ రాజీవ్ నగర్, పలు గుత్తి కోయ గ్రామాలలో ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు వెలిశాయి.
ఇందులో మావోయిస్టులను లొంగిపొమ్మని జనజీవన స్రవంతిలో కలవమని పేర్కొనడం జరిగినది.
కొన్ని ప్రధాన కూడలిలో మావోయిస్టుల ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో వాల్ పోస్టర్లు.
సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి ఆశా కిరణం ఎన్నడైంది?
పరిణామాలు మీకు ఎదురైన సవాళ్లు తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మ సంతృప్తిని మిగిల్చింది ఏంది?
ఆత్మసంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ నలభై ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడు వారిన బిడు భూమి లాగా అయ్యింది.
మావోయిస్టు అగ్ర నాయకులారా, ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, కాల అనుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కండి.
అడవినివిడి ప్రజల్లోకి రండి.ప్రజాస్వామ్యం గొంతుక కండి! ఆయుధాలు మనకు వద్దు- ప్రజా మేధా మార్గమే మనకు ముద్దు.
ఆయుధాలు వీడండి జనజీవన స్రవంతిలోకి రాండి! మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి.
మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ అని పోస్టర్లు దర్శనమిస్తున్నాయి…