టీబీజీకేఎస్ ఇన్‌చార్జిగా కొప్పుల ఈశ్వర్.
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా కొనసాగే తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం(టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకిచ్చారు. ఆ సంఘం ఇన్‌చార్జిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను తాజాగా నియమించడం గులాబీ పార్టీలో, రాజకీయవర్గాల్లో చర్చకు తెర లేపింది. తెలంగాణ భవన్‌లో బుదవారం కేటీఆర్ సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కవితకు ఆ పార్టీలో, అనుబంధ సంఘాల్లోనూ ప్రాధాన్యం తగ్గుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
Post Views: 28