రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : రేపు శుక్రవారం ఖమ్మం, జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో  కలిసి శుక్రవారం ఉదయం 11.00 గంటలకు హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం నియోజకవర్గంలో పర్యటిస్తారు.ఖమ్మం లో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మదనలాల్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఇటీవల మాతృవియోగం చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే  రేగా కాంతారావు ని కలిసి  పరామర్శించనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram