గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.: తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇంకా స్పందించలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మీడియా చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందేనన్నారు. దీన్ని బిఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం తప్పన్నారు. తాను నిపుణులతో చర్చించే ఆర్డినెన్సు మద్దతిచ్చానని, బిఆర్ఎస్ వాళ్లు తన దారికి రావాల్సిందేనని స్పష్టం చేశారు.
Post Views: 25