గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి చోదకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మోతే వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నీలాద్రి పేట గండి గ్రామానికి చెందిన కుంజా శివ వ్యక్తిగత పనులపై కరకగూడెం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. మోతే సమీపంలో కోళ్ల ఫారం వద్ద తాగిన మైకంలో వాహనం అదుపుతప్పి రహదారిపై పడిపోయాడు అతడికి తీవ్ర గాయాలు కగా అటువైపుగా వెళ్తున్న కానిస్టేబుల్స్, సింహ చలం, వినోద్ దగ్గరుండి, అతడిని కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కి తరలించారు.
Post Views: 36