అధికారం ఎవరికి శాశ్వతం కాదని తమకు కూడా ఒక రోజు వస్తుందన్న కేటీఆర్.
గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ ; బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భయానక పరిస్థితులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని… తమ హక్కులను కాపాడుకునేందుకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.
Post Views: 15