పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు.దారుణాలకు పాల్పడుతుంటారు…
గోల్డెన్ న్యూస్ / జనగామ :పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులు.. అందుకు విరుద్ధంగా వక్ర దృష్టిలో చూస్తుంటారు. చివరకు సభ్య సమాజం తల దించుకునేలా దారుణాలకు పాల్పడుతుంటారు… సభ్య సమాజం తలదించుకునేలా చేసే దారుణ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. కన్న కూతురి పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి.
ఈ హేయమైన చర్యను బాలిక మొదటగా తల్లి దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో బాలిక తన పెద్దమ్మకు ఈ విషయాన్ని తెలిపింది, పెద్దమ్మ సహకారంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై దేవరుప్పుల ఎస్సై ఊర సృజన్ కుమార్ మీడియాకు మాట్లాడుతూ – “బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే బాధిత బాలికను బాలల సంరక్షణ అధికారుల సంరక్షణ అప్పగించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఇలా అనుచితంగా ప్రవర్తించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.