కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా వెలసిన హోర్డింగులు

గోల్డెన్ న్యూస్ / సికింద్రాబాద్ : కాంగ్రెస్ పాలనలో ఏ టు జెడ్ వరకు అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ హోర్డింగులు దర్శనమిచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపిస్తూ హోర్డింగులు పెట్టారు. కాంగ్రెస్ హయాంలో భూ కుంభకోణాలు, అక్రమ దందాలు, రైతులపై దాడులు, నకిలీ పెట్టుబడులు, అక్రమ కూల్చివేతలు జరుగుతున్నాయని వాటిలో వివరించారు. వీటిని జూబ్లీ బస్‌స్టాప్ సమీపంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉండటంతో కంటోన్మెంట్ సిబ్బంది ఈ హోర్డింగులను తొలగించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram