గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ మైనారిటీ యువతకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ లేదా పీజీలో 50 శాతం మార్కుల అర్హత కలిగి ఉండి, 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు కలిగి ఉన్నవారు పథకానికి అర్హులని వెల్లడించారు.
Post Views: 13