మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు..

♦పినపాక నియోజకవర్గానికి అదనంగా 1500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు..

♦ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపనకు ముందడుగు..

♦సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పినపాక నియోజకవర్గం ఆయకట్టుకు సాగునీరు అందజేస్తాం..

♦ఇందిరా మహిళ  శక్తి సంబరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు : పినపాక నియోజకవర్గ పరిధిలోని బూర్గంపాడు మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభా ప్రాంగణానికి విచ్చేసిన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పినపాక నియోజకవర్గం పరిధిలో మహిళా మహిళా స్వయం శక్తి సంఘాల ద్వారా చేపడుతున్న పనులు ప్రభుత్వం మహిళల అభివృద్ధికి కల్పిస్తున్న పథకాల గురించి ప్రగతి నివేదికను తెలియజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..

 

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోంది అన్నారు. వడ్డీ లేని రుణాలు తో పాటు, మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన బీమా భద్రత పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సబ్సిడీ బియ్యం వంటి పథకాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనం, అని తెలిపారు .

 

గత ప్రభుత్వం పాలనలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు తెచ్చి కాలేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు ఎంతో అద్భుతం అని చెప్పిన అవి ఏ పేదవాడికి ఉపయోగపడలేదని, పేదల జీవితాల్లో అసలు మార్పే రాలేదన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ప్రజల దీవెనలతో ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆడబిడ్డలకు భరోసా ఇచ్చే ప్రభుత్వంగా రూపాంతరం చెందింది, అని అన్నారు.

 

గత ప్రభుత్వం 3075 కోట్లు పావలా వడ్డీకి సంబంధించిన బకాయిలు చెల్లించలేదని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 865 కోట్లు పావల వడ్డీ కింద మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశామన్నారు. అదేవిధంగా, మహిళా సభ్యుల బీమా పథకాన్ని పునరుద్ధరించి, సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షల బీమా భద్రత కల్పించినట్లు చెప్పారు.

 

గత పాలనలో 18–60 ఏళ్ల వయస్సులో మాత్రమే మహిళా స్వయం శక్తి సంఘాల్లో సభ్యత్వం ఉండేదని, ఇప్పుడైతే 15–65 ఏళ్ల మహిళలు సభ్యులయ్యే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలియజేశారు. ఇది లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు.

పేదలకు ఇళ్ల నిర్మాణం ప్రధాన ప్రాధాన్యతగా తీసుకున్న ప్రభుత్వం మొదటి విడతలో అశ్వరావుపేట నియోజకవర్గానికి 4,500 ఇళ్లను మంజూరు చేసిందన్నారు. పినపాక నియోజకవర్గానికి అదనంగా మరో 1500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు.

 

అలాగే, మహిళల అభివృద్ధికి దోహదపడేలా వెయ్యి సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా సంఘాల పేరుపై బస్సుల కొనుగోలు వంటి ఆవిష్కరణాత్మక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలిపారు.

 

గత ప్రభుత్వం పేదవాడి పొట్ట నింపుకునే తెల్ల రాసిన కార్డు ఇవ్వడం మర్చిపోతే ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం రేషన్ కార్డ్ మాత్రమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఆడబిడ్డలకి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాటాకు ఇల్లు ఉండే ప్రతి గూడాన్ని ప్రత్యక్షంగా చూసి పేదవాడి బాధలు ఆవేదనను తీర్చే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. చాలా సంవత్సరాలుగా గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజన ఇతరులు సాగు చేస్తున్న పోడు భూమి దారులను ఇబ్బందులకు చేయవద్దని అధికారులు అత్యుత్సాహంతో వారిని ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి తెలిపారు. పేదవాడికి సాయం చేసే, వాడికి అండగా ఉండి పేదవాడి కన్నీరు తుడిచే ప్రభుత్వం పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి అన్నారు.

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా పినపాక నియోజకవర్గం లోని సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పరిశ్రమలు అధికంగా ఉన్న ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో పొల్యూషన్ కూడా అధికంగా ఉంటుందని, కార్మికుల వైద్య సేవల కోసం రెవెన్యూ శాఖ మంత్రిగా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయించే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతమైన పినపాక మరియు భద్రాచలం నియోజకవర్గం వర్షాకాలం వచ్చిందంటే ముంపు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించేవారని, ముంపు ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

 

పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పినపాక నియోజకవర్గం లో 4700 స్వయం సహాయక సంఘాలలో 46వేల మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం ద్వారా కుటుంబం, గ్రామం మరియు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆర్థిక మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ బండ, మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యు, రేషన్ కార్డులు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే 4500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యం అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థాపనకు మంజూరు, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సు నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దోమలపాడు ప్రాజెక్టు అభివృద్ధి కోసం నిధులు కేటాయించవలసిందిగా మంత్రిని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపన మరియు సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని మంత్రిని కోరారు.

 

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ..

ఇందిరా మహిళా శక్తి సంబరాలు – మహిళల అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం..

 

మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి 500 రూపాయల్లో గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు మహిళలకు మరింతగా స్వేచ్ఛను కలిగిస్తున్నాయని చెప్పారు. ఇంటి పనులతో పాటు మహిళలు స్వయం ఉపాధికి తగిన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ కొత్త యూనిట్లను స్థాపిస్తూ మోడల్‌గా మారుతున్నారని వివరించారు. వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని, గ్రామీణ స్థాయిలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని తెలిపారు.

ఇంటికి యజమానిగా మారుతున్న మహిళలు ప్రభుత్వ సహకారంతో స్వయం సమృద్ధికి పురోగమిస్తున్నారని కలెక్టర్ అన్నారు.

 

అనంతరం బ్యాంకు లింకేజీ ద్వారా19.18 కోట్లు, వడ్డీ లేని రుణాలు 3341 సంఘాలకు 3.26 కోట్లు మరియు రుణబీమా ద్వారా ఐదు లక్షల 5,19 రూపాయల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మి, పినపాక తాసిల్దారు రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram