హాస్యనటుడు ఫిష్ వెంకట్ మృతి.

గోల్డెన్ న్యూస్  / హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్  (53) కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన. శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు. కోల్పోయారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని. రోజుల కిందట ఆస్పత్రిలో చేర్చారు. రెండు కిడ్నీలు  మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.వైద్యసేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం.

Facebook
WhatsApp
Twitter
Telegram