గోల్డెన్ న్యూస్ తెలంగాణ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రప్పా రప్పా ఫ్లెక్సీల ఫీవర్ తెలంగాణకు పాకింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన లో.. రప్పా రప్పా ప్లకార్డులు దర్శనమిచ్చాయి. ‘కేసీఆర్ 3.0 లోడింగ్.. 2028లో రప్పా రప్పా కాంగ్రెస్ నాయకులకి మిత్తి వడ్డీతో సహా చెల్లిస్తాం’ అంటూ కేటీఆర్ చిత్రపటంతో కూడిన ప్లకార్డులను బీఆర్ఎస్ అభిమానులు ప్రదర్శించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Post Views: 74