అప్పుడే నామకరణాలు కూడా అయిపోయాయి..
గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : రాష్ట్ర రాజకీయాల్లో అతి త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో ముఖ్యనేతగా ఉన్న ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు సాలిడ్ సమాచారం అందుతోంది. తాజాగా హుజూరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రచారం కార్యకర్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్దగా గుర్తింపు ఇవ్వని బీజేపీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి
“బహుజన జనతా సమితి” గా నామకరణం చేసినట్లు సమాచారం.
బీసీ హక్కుల కోసం బలమైన ఎజెండాను ముందుకు తీసుకొచ్చి.. తన సామాజిక వర్గం నుంచి గట్టి మద్దతు పొందాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Post Views: 28