గోల్డెన్ న్యూస్ /పినపాక : పిడుగుపాటుకు మహిళా మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బోటిగూడెం గ్రామానికి చెందిన కొమరం రమణ (50) ఊరు శివారులోని పొలంలో నాటు వేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. రమణ మృతి తో ఆ గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
Post Views: 27