నా కోరికను తీరుస్తేనే సంతకం పెడతా విఆర్ఓ

పక్కలోకి వస్తేనే సంతకం పెడతా.

వివాహితపై వీఆర్వో లైంగిక వేధింపులు.

 బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు.

గోల్డెన్ న్యూస్ / పల్నాడు : రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. ఈ క్రమంలోనే వివాహితను తన గదికి పిలిపించి తన కోరిక తీరుస్తేనే దరఖాస్తుపై సంతకం చేస్తానని వేధించిన వీఆర్వో వెంకయ్య.

వీఆర్వో వేధింపులను వీడియో తీసి పోలీసులకి ఫిర్యాదు చేసిన బాధితురాలు..

Facebook
WhatsApp
Twitter
Telegram