వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గోల్డెన్ న్యూస్/మణుగూరు : పినపాక నియోజకవర్గం లోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,  భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందని పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం ఉంటే తప్పా వర్షాల సమయంలో రైతులు, ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.  ముఖ్యంగా రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు చేశారు. మణుగూరు మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఎంపీడీవో, పంచాయతీ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం జరిపి తక్షణ  చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.వర్షాల కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు హాని కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా అశోక్ నగర్, సురక్ష బస్టాండ్, సుందరయ్య నగర్, శ్రీశ్రీ నగర్, ఆదర్శనగర్, కాళీమాత ఏరియా ,గాంధీనగర్,వినాయకనగర్, ఐలమ్మ నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram