తాలిపేరుకు ప్రాజెక్టుకు భారీ వరద నీరు.

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం :  చర్ల మండలంలోని  మధ్యతరహా తాలిపేరు ప్రాజెక్టుకు బుధవారం భారీగా వరద నీరు వస్తుండగా. అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 28 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. ఎగువ ఛత్తీస్ గఢ్ పాటు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తింది. తాలిపేరుతో పాటు చింత వాగు, పగిడి వాగు, రోటెంత వాగు, రాళ్ల వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయానికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరింది. తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద పరవళ్లు తొక్కుతూ ఉండటంతో దిగువ తేగడ వద్ద లో లెవల్ చప్టా నీటమునిగింది. వరద పరిస్థితిని ఏఈ సంపత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈతవాగు వరద రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రామచంద్రాపురం, బత్తినపల్లి, బట్టి గూడెం తదితర గ్రామాల్లో వాగులు పొంగుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram