దారుణం :వ్యక్తి ప్రాణాలు తీసిన వాట్సాప్ ఎమోజీ

ప్రస్తుత రోజుల్లో పదిమందిలో అవమానిస్తున్నా భరిస్తున్నారు కానీ.. సోషల్ మీడియాలో ఎమోజీలో రియాక్ట్ అయితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.;

గోల్డెన్ న్యూస్ /సూర్యాపేట : జిల్లా కేంద్రంలో ఆగస్టు 3వ తేదీన పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కుల సంఘం సభ్యులు

 

ఈ నేపథ్యంలో ప్రస్తుత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్న అప్పం శ్రీనివాస్‌కు, ఇటీవల నామినేషన్ వేసిన రాములకు తీవ్ర విబేధాలు కొనసాగుతుండగా, శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న రాములు

 

రాములు తనపై చేస్తున్న ఆరోపణలకు “సూర్యాపేట పట్టణ పద్మశాలి బాంధవులు” అనే వాట్సాప్ గ్రూపులో వివరణ ఇచ్చిన శ్రీనివాస్

 

శ్రీనివాస్ ఇచ్చిన వివరణకు మద్దతుగా చప్పట్ల ఎమోజీతో రియాక్టయిన హోల్ సేల్ చెప్పుల వ్యాపారి మానుపురి కృపాకర్(54)

 

దీంతో కృపాకర్‌కు ఫోన్ చేసి దూషించిన రాములు

 

రాములు ప్రవర్తన పట్ల ఫిర్యాదు చేసేందుకు పద్మశాలి భవనానికి చేరుకోగా, కృపాకర్ పై దాడి చేసిన రాములు,అతని కుమారుడు, మరికొందరు వ్యక్తులు

 

దాడిలో అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కృపాకర్

Facebook
WhatsApp
Twitter
Telegram