ప్లే స్టోర్లో అందుబాటులో వచ్చిన యాప్.
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : వర్షాకాలంలో ఏదో ఒకచోట పిడుగులు పడుతుండటం మనం చూస్తుంటాం. పిడుగుల తీవ్రత కు ప్రజలు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటాయి. ఈ ప్రమాదాల నుంచి బయట పడటంతో పాటు పిడుగుపాటును ముందుగానే గుర్తించ డానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పిడుగు అపాయా న్ని ముందుగానే-గుర్తించి ఈ యాప్ మనల్ని అప్రమత్తం) చేస్తుంది. వాతావర ణానికి సంబంధిం చిన వివరాలు తెలుసుకోవడానికి కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రజలకు ఉపయోగపడేలా ‘దామిని’ (దామిని లైట్నింగ్ అలర్ట్) యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పేరు, మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా.. మన నివసించే, ప్రాంతంలో పిడుగు పడే అవకాశాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుంది. వివిధ భాషల్లో అందుబాటులో తీసుకొచ్చిన ఈ యాప్.. పిడుగు పడిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేస్తుంది. వర్షం కురుస్తున్న సమయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిడుగులకు గురికాకుండా ఉండొచ్చని నిపుణులు సెలవిస్తున్నారు. ఆరుబయట ఉండకూడదు. చెట్ల కింద నిలబడకుండా చూసుకోవాలి. మెరుపులు అధికంగా వస్తున్నట్లయితే ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు’ ఉపయోగించొద్దని నిపుణలు సూచిస్తున్నారు.