హైదరాబాద్‌: మియాపూర్‌లో విషాదం.

భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య.

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ : మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో విద్యార్ధిని అక్కడికక్కడే మృతి చెందింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్ధినిని మియాపూర్ లోని ప్రైవేట్ పాఠశాలలు పదవ తరగతి చదువుతున్న హన్సిక (14)గా గుర్తించారు. మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఐదవ అంతస్తు పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram