పశ్చిమ బెంగాల్ పరగణా జిల్లాకు చెందిన ఈవ్యక్తి (రవీంద్రనాథ్),బంగాళాఖాతంలో హల్దియా వద్ద చేపలు పట్టడానికి వెళ్ళాడు. అతనితోపాటు 15 మంది మిత్రులు కూడా ఉన్నారు
ఆకస్మాత్తుగా సముద్రం తన అలల దిక్కును మార్చుకుంది. ఒక పెద్ద తుఫాన్ చుట్టేసింది .అలల తాకిడికి తట్టుకోలేక వాళ్లు ప్రయాణిస్తున్న పడవ తలకిందులైంది
సహచరులందరూ అలల తాకిడికి ఎక్కడెక్కడో కొట్టుకుపోయారు రవీంద్రనాథ్ ఒక్కడేమిగిలిపోయాడు
ఒకవైపు చుట్టుముట్టిన తుఫాను. మరొకవైపు ఒంటరితనం రవీంద్రనాథ్ గుండెను చిక్కబట్టుకున్నాడు. భయపడలేదు .వృత్తిరీత్యా చేపలు పట్టేవాడు కాబట్టి అతనికి నీళ్లు ఎప్పుడు శత్రువు కాదు. అతడు తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. ఈదడం మొదలుపెట్టాడు. పైన ఆకాశం .కింద సముద్రం .గంటలు గడుస్తున్నాయి .రోజులు గడుస్తున్నాయి
రవీంద్రనాథ్ సముద్రంలో ఒక్కడే ఐదు రోజులు ఈదాడు. తిండి లేదు .తాగడానికి నీరు లేదు. బతకడం అనే ఒక ఆకాంక్ష తప్ప అతన్ని రక్షించేది ఎవరూ లేరు. వర్షం వచ్చినప్పుడు వర్షపు నీటితో గొంతు తడుపుకోవడం తప్ప మరేమీ లేదు. చావు దగ్గర పడుతున్నది .కానీ అతనిలోని ధైర్యం అతనిని నిలబెట్టింది
ఐదవ రోజు “ఎంవి జవాద్ “అనే పేరు గల బంగ్లాదేశ్ నౌక దూరంగా కనబడింది .దాని కెప్టెన్ ఎవరో దూరంగా చేతులు కదిలిస్థున్నట్టుగ గమనించగలిగాడు .జాగ్రత్తగా చూస్తే ఎవరో మనిషి ఈత కొడుతూ వస్తున్నట్టుగా చూసాడు .
ఆ కెప్టెన్ ఒక లైఫ్ జాకెట్ ని విసిరాడు .రవీంద్రనాథ్ దాన్ని పట్టుకోలేకపోయాడు .ఆయన కెప్టెన్ తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు .వాళ్ళకి సరిహద్దులు మతాలు, కులాలు జ్ఞాపకం రాలేదు .మానవత్వమే వాళ్లను ముందుకు నడిపింది
కొంత దూరంలో రవీంద్రనాథ్ మళ్లీ కనపడ్డాడు .ఈసారి కెప్టెన్ అతనిని గుర్తించి లైఫ్ జాకెట్ విసిరాడు. రవీంద్రనాథ్ దాన్ని పట్టుకొని నౌకను చేర గలిగాడు
అతనిని మెల్లగా క్రేన్ సహాయంతో నౌక లోకి చేర్చారు . అప్పటికే అతను విపరీతంగా అలసిపోయి ఉన్నాడు .అతను నౌకలోకి చేరగానే అందులోని నావికులందరూ సంతోషంతో గట్టిగా అరిచారు .అక్కడ ఒక మనిషిని రక్షించగలిగాము అనే మానవత్వమే కనపడింది .
అక్కడ ఒక జీవితాన్ని కాపాడడం గాక మానవత్వాన్ని కాపాడినట్లు భావించారు
ఒక మనిషి పట్టుదల మరొక మనిషి కారుణ్యం ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకుపోతుందని ఈ ఘటన రుజువు చేస్తోంది
ఈ వీడియోను నౌకలోని ఒక నావికుడు తీసి ప్రపంచానికి ఈఘటన తెలియజేశాడు..