⇒ అమ్మ నేను ఏమి పాపం చేసాను..
⇒ నన్ను కనమని చెప్పానా ..
⇒నన్ను దేనికి చెత్త కుప్పలో పడేశావ్…
⇒ నీకు భారం అయితే పిల్లలు లేని వారికి ఇచ్చినా పెంచుకుంటారు కదమ్మ..
గోల్డెన్ న్యూస్/ గుంటూరు : ఏ తల్లి కన్న బిడ్డ.. చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిపోయారు వెళ్లిన ఓ వ్యక్తికి ఆ శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. . ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి సమయంలో నిడమర్రు టిక్కో గృహ సముదాయం లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు చెత్తకుప్పలో వదిలి వెళ్ళిన ఘటన . అక్కడ శిశువు ఏడుపు వినిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. శిశువును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు.
గురువారం అమావాస్య రోజు పుట్ఠినది అనే కారణమా ?
లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.