వాగు దాటలేక నరకయాతన.. గిరిజన మహిళ ప్రసవ వేదన

గోల్డెన్ న్యూస్ / ములుగు :  వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా వర్షాలు, వరదల సమయంలో మారుమూల మండలాల్లో నివసిస్తున్న గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో గిరిజన ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా.. ములుగు జిల్లా తాడ్వయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి కృష్ణవేణికి  అనే గర్భిణీకి ప్రసవం కోసం అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం లో  విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  వాగులు వంకలు చెరువులో పొంగిపొర్లు తున్నాయి, ఈ క్రమంలోనే  తాడ్వయి మండలం బంధాల గ్రామపంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి కృష్ణవేణికి గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు అష్ట కష్టాలు పడుతూ.. ఉదృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని వాగులో నిండు గర్భిణిని  భుజాలపై మోసుకుంటూ వెళ్లి వాగు దాటించారు. అక్కడినుంచి 108 వాహనం ద్వారా ఎటునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కలిసిన తెలంగాణ. శుక్రవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, గంటకు 30 నుంచి 40కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు విడుదలచేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram