నూతన సిడిపిఓ లకు నియామక పత్రాలు అందజేసిన సీతక్క

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : సచివాలయంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న 23 మంది సిడిపిఓ లు సిడిపివోలుగా నియామక పత్రాలు అందుకున్న అందరికీ అభినందనలు

సిడిపిఓలు మహిళా శిశు సంక్షేమ శాఖ వెన్నెముక లాంటివారు

మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ వేల మంది పోటీ పడితే మీ 23 మంది ఉద్యోగాలు సాధించారుమీరంతా ఎంతో అంకితభావంతో ఉద్యోగాలు సాధించారు

 

ఇదే అంకితభావంతో మీరంతా విధులు నిర్వహించాలి

ఉన్నత విద్యావంతులైన మీరు మా శాఖలో చేరటం అభినందనీయం ఆరు సంవత్సరాల వరకు చిన్నారులు, గర్భిణీలు బాలింతలకు సేవ చేసే అదృష్టం మీకు దక్కింది శిశువులు మహిళల సంరక్షణతో పాటు దత్తత ప్రక్రియ, మహిళా సాధికారత వంటి అంశాలను నిర్వర్తించాల్సి ఉంటుంది అంగన్వాడి సేవలు పేద ప్రజలకు ఎంతో అవసరం అంగన్వాడీ లబ్ధిదారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే బాధ్యత మీదే

 

మా శాఖలో ఇది కొత్త తరం 

అంగన్వాడీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సేవలను లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత మీదే ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు అంగన్వాడీలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నాం

 

అంగన్వాడిలో 57 రకాల ఆట వస్తువులు ఇచ్చాము .

వారంలో రెండు రోజులు ఎగ్ బిర్యాని పెడుతున్నాము  

పోషకార లోపాన్ని తగ్గించేందుకు పాలు గుడ్లు క్రమం తప్పకుండా సరఫరా చూస్తున్నాము. చిన్నారులకు యూనిఫామ్స్ కూడా ఇస్తున్నాము మీరంతా అంకితభావంతో పనిచేయాలి కార్యాలయాలకే పరిమితం కాకుండా ఫీల్డ్ విజిట్ చేయాలి  అంగన్వాడి సేవలు మెరుగుదలకు మీరు సలహాలు సూచనలు ఇవ్వవచ్చు  ఎలాంటి రాజకీయ ఒప్పులకు లొంగాల్సిన అవసరం లేదు.. స్వేచ్ఛగా పనిచేయండి

Facebook
WhatsApp
Twitter
Telegram