కల్తీ నూనె స్థావరంపై దాడులు
డబ్బు సంపాదన కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు…ఎంత నీచానికైనా దిగజారుతున్నారు కొందరు వ్యాపారులు…రూపాయి లాభం వస్తుందంటే చాలు ఎదుటి వాడి ప్రాణాలు పణంగా పెట్టయినా తాము సొమ్ము చేసుకుందామనుకునే విపరీత ధోరణి వీరికే సొంతం.
జంతు కళేబరాలు, కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.జంతువులకలేబరాల్లో నుంచి నూనె తయారీ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పరకాల పోలీసులు
హనుమకొండ జిల్లా పరకాల లో (వనస్పతి) నూనె తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపు దాడి..
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు..
ప్రధాన సూత్రధారి.. మండి బజార్లో ఓ వ్యాపారి..
జంతువుల వ్యర్ధాల నుంచి తయారుచేసిన (వనస్పతి) నూనెను పలు హోటళ్లకు అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దందా..
నూనె (వనస్పతి) తయారీ కేంద్రం లో లభించిన సామాగ్రిని,26 పీపాల నూనె సీజ్ చేసిన పోలీసులు..
ప్రధానంగా హనుమకొండ వరంగల్ నగరాల్లోని పలు హోటళ్లలో ఈ నూనె అమ్మకాలు ఎక్కువగా జరుపుతున్నట్లు విచారణలో వెల్లడి..
Post Views: 108