యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని అక్కను చంపిన తమ్ముడు

వైర్‌తో గొంతును బిగించి ఊపిరాడకుండా చేసి అక్కను హతమార్చిన తమ్ముడు

గోల్డెన్ న్యూస్ / రంగారెడ్డి : కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉండగా, డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం వేచి చూస్తున్న పెద్ద కూతురు రుచిత(21)

గత కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన యువకుడికి రుచితకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా, ఈ విషయంలో అనేక సార్లు గొడవలకు దిగిన ఇరు కుటుంబాలు

ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీకి వెళ్లగా, ఇకపై మాట్లాడుకోమని చెప్పిన యువతి, యువకుడు

సోమవారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో రుచిత తిరిగి ఆ యువకుడితో మాట్లాడడం గమనించి ఆమెతో వాగ్వాదానికి దిగిన తమ్ముడు రోహిత్(20)

ఈ క్రమంలో ఆవేశంతో గొంతును వైరుతో బిగించగా, ఊపిరాడక చనిపోయిన రుచిత

రుచిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

Facebook
WhatsApp
Twitter
Telegram