1 కిలోమీటర్ డోలీపై మృతదేహం తరలింపు

రోడ్డు లేక మృతదేహాన్ని 1 కిలోమీటర్  డోలి కట్టి మోసిన ఆదివాసీలు .

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో డోలి మోతలు తప్పడం లేదు . ఆ గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేక మూడు కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని డోలీ మోతతో గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన కొవ్వాసి నందమ్మ (65) అనే మహిళ అనారోగ్య సమస్యలను తట్టుకోలేక సోమవారం  ఆత్మహత్య చేసుకున్నందుకు గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కరకగూడెం, అక్కడ నుంచి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని . అశ్వాపురంపాడు గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు వరకు వాహనంలో తీసుకొచ్చారు.  అక్కడి నుంచి గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో అటవీ  ప్రాంతంలో ఒక కిలోమీటర్ దూరం కుటుంబ సభ్యుల, గ్రామస్తుల సహాయంతో  మంచంపై మృతదేహాన్ని తీసుకెళ్లారు.

అధికారులు స్పందించి తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అశ్వాపురం పాడు గ్రామస్థులు కోరుతున్నారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram