మణుగూరు ఏడిఈ ఉమారావు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : కరకగూడెం విద్యుత్ ఏఈ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాలపై కరకగూడెం మండలంలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏడిఓ ఉమా రావు మాట్లాడుతూ..
రైతులుపంటలకు ఉపయోగించే కరెంటు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కరెంటుకు ప్లాస్టిక్ బాక్సులు వాడాలని,కరెంటు మోటార్ వేసే ముందు తడి కాళ్ళతో గాని,తడి చేతులతో గాని స్విచ్చులు వేసినచో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు.వర్షం వచ్చేటప్పుడు మోటార్ దగ్గరకు వెళ్ళకూడదని,గాలి వలన వైర్లు తెగడంగాని స్తంభాలు విరిగిపోయినచో లైన్మెన్ కి సమాచారం అందించి,రైతు సమస్యలు పరిష్కారించుకోవాలని పేర్కొన్నారు. రైతుల కోసం కరెంట్ సిబ్బంది పనిచేయడానికి అందుబాటులో ఉంటామని, రైతులకు సరిపడే విధంగా కరెంటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్,రవీందర్,రత్నశేఖర్,వేంకటేశ్వర్లు,సాగర్,నరసింహారావు,ఉపేందర్,రైతులు పాల్గోన్నారు.