ప్రధానమంత్రి కిసాన్ నిధులు విడుదల!

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిషన్ నిధులు శనివారం విడుదలయ్యాయి, ఈ పథకం కింద 20వ విడత నిధులను ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో కిసాన్ సమ్మన్ నిధి కింద ఈ నిధులు విడుదల చేశారు

 

మొత్తం రూ. 20,500 కోట్లను రైతుల (farmers) ఖాతాల్లోకి జమచేశారు. దీని ద్వారా మొత్తం 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా, ప్రధాన్‌మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

దేశవ్యాప్తంగా 9.8 కోట్లమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.22 వేల కోట్లకుపైగా నిధులను జమచేశారు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధులను విడుదల చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం మోదీ సర్కార్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది.

 

ఈ పథకం కింద రైతులకు ఏటా ఒక్కోవిడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందనుంది. ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు 19 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram