యువరైతు సజీవదహనం.

గోల్డెన్ న్యూస్/ గుండాల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ విద్యుదాఘాతంతో వాహనంతో సహా దగ్ధమై యువకుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం…. శంభునిగూడెం పంచాయితీ వెన్నెలబైలు గ్రామానికి చెందిన పర్సిక రాజు (35) ద్విచక్ర వాహనంపై తన పొలానికి  వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు అతడికి తగిలాయి. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ద్విచక్ర వాహనం, సహా రాజు అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram