ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు సిద్ధబోయిన శ్రీకాంత్ పిలుపు వచ్చారు.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి వీరాపురం క్రాస్ రోడ్ కొమరం భీం కూడలిలో ఆగస్టు 9వ తేదీన జరగనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అన్ని ఆదివాసి సంఘాలతో కలిసి జయప్రదం చేసేందుకు ప్రతి గ్రామం నుంచి యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు.
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవం పండగగా ప్రతి ఇంట పండగలా సంస్కృతి సాంప్రదాయాలను ఆదివాసీల అస్తిత్వాన్ని హక్కులను పరిరక్షణకై పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున పిలుపునిచ్చారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలని ప్రత్యేక నిధులు కేటాయించాలని హక్కులు చట్టాలపై సమీక్ష చేయాలని ఆగస్టు 9న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రత్యేక ఆర్ధిక పాలసీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం చే అధికారికంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని దగ్గరుండి జరిపి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.