గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ : ఇన్సూరెన్స్ లేని వాహనాలకు విధించే జరిమానాను భారీగా పెంచాలని కేంద్రం యోచిస్తోంది ప్రస్తుతం తొలి సారి పట్టుబడితే ₹2,000, ఆ తర్వాత ₹4,000 ఫైన్ వేస్తున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం మొదటిసారి పట్టుబడితే ప్రైమరీ ఇన్సూరెన్స్ ప్రీమియానికి 3 రెట్లు, ఆ తర్వాత నుంచి 5 రెట్లు జరిమానా విధిస్తారు. దీనితో పాటు స్పీడ్ లిమిట్స్ సవరించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారికి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ పెట్టాలని నిర్ణయించింది.
Post Views: 137