రోడ్డు ప్రమాదంలో సిపిఐ రాష్ట్ర నాయకులు అయోధ్య దుర్మరణం

గోల్డెన్ న్యూస్/ సూర్యాపేట:  జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన సీపీఐ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బోల్లోజు అయోధ్య (65) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు చెందారు.  సూర్యాపేట నుంచి హైదరాబాద్ కారులో ఆసుపత్రికి కి వెళుతున్న క్రమంలో, సూర్యాపేట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అయోధ్యకు తీవ్రగాయాలయ్యాయి. సహ ప్రయాణికులు వెంటనే ఆయనను సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బోల్లోజు అయోధ్య మరణవార్త తెలిసిన వెంటనే మణుగూరు ప్రాంత ప్రజలు, సీపీఐ కార్యకర్తలు, నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన స్వగ్రామానికి బంధుమిత్రులు, సీపీఐ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్య మృతితో మణుగూరు ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయోధ్య మరణవార్త విన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ సీనియర్ నేతలు,  దిగ్భ్రాంతికి లోనయ్యారు .

 

 

 

 

 

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram