గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి, అన్నారు. బుధవారం జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం రేవంత్ రెడ్డి, స్మరించు కున్నారు తెలంగాణ జాతిపిత జయశంకర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటా రని తెలిపారు.
స్వరాష్ట్ర కలల జెండాను భవిష్యత్తు ఏజెండాను ఆయన వదిలిపెట్టలేద న్నారు తెలంగాణ శ్వాసగా ధ్యాసగా లక్ష్యంగా బతికి కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన స్ఫూర్తి జయశంకర్ అని ఆయన అన్నారు. అయన తెలంగాణ పోరాట యోధుడని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ప్రజలు ఏ విధంగా నష్ట పోయారో ఎప్పటికప్పుడు గణాంకాల తో వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా ఉంచిన ఘనత జయశంకర్ దేనని సీఎం అన్నారు.
Post Views: 3